సీఎం కేసీఆర్ జైలు కి వెళ్ళక తప్పదు – బండి సంజయ్

Sunday, August 30th, 2020, 11:05:40 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అని చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ను తగ్గించి చూపిస్తుంది అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ తీరు పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం లో అవినీతి పెరిగిపోయింది అని, సీఎం కేసీఆర్ జైలుకి వెళ్ళక తప్పదు అని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కార్పొరేట్ ఆసుపత్రుల తో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు అయింది అని ఆరోపణలు చేశారు. అంతేకాక వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం లో రైతులు నష్ట పోయిన సంగతి తెలిసిందే. భారీ వరదలతో ముంపు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. అయితే అలా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆడుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.