అబద్దాల ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మొద్దు – బండి సంజయ్

Friday, November 20th, 2020, 02:26:07 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మొదలు ప్రతి పక్ష పార్టీ బీజేపీ మరియు అధికార పార్టీ తెరాస ల మద్య మాటల యుద్ధం నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద సాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది అని తెరాస ఆరోపించిన నేపథ్యంలో బండి సంజయ్ ఒక సవాల్ విసిరారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం వద్ద ప్రమాణం చేసి ఆ లేఖ తాను రాయలేదు అని చెబుతా అంటూ అక్కడికి చేరుకున్నారు. సీఎం కూడా సవాల్ నీ స్వీకరించి రావాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

అయితే అమ్మవార్ని దర్శించుకున్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తను వరద సహాయం ఆపివేయాలని లేఖ రాయలేదు అని,సీఎం కేసీఆర్ అలా అనడం బాధ కలిగించింది అని బండి సంజయ్ అన్నారు. అయితే బీజేపీ లేటర్ హెడ్ మరియు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని బండి సంజయ్ మీడియా తో వెల్లడించారు. అయితే గతంలో అనేకసార్లు సీఎం కి, ఎన్నికల కమిషనర్ లకు లేఖలు రాశా అని,కానీ ఈ సంతకం తనది కాదు అని అన్నారు. వరద సహాయం అందక ప్రజల నుండి వ్యతిరేకత రావడం తో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ తెరాస ప్రభుత్వం పై బండి సంజయ్ విరుచుకు పడ్డారు.

అయితే ఈ మేరకు తెరాస తీరును ఎండగడుతూ బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. భాగ్య నగరం మేయర్ పీఠాన్ని తమకు కట్టబెట్టాలని కోరుతున్న అని అడిగారు. అంతేకాక వరద సాయం 25 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెరాస మేనిఫెస్టో లో చేసిన హామీలను ఎన్ని నెరవేర్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తా అని అన్నారు, ఎక్కడ చేశారు అని అన్నారు. అంతేకాక వస్తాయి, పోతాయి, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయొద్దు అని హితవు పలికారు. మజ్లిస్ తో కుమ్మక్కై కేసీఆర్ బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నారు అని,అబద్దాల ముఖ్యమంత్రిని నమ్మొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.