సుప్రీం లో కేసు వేసింది కేసీఆరే – బండి సంజయ్

Wednesday, October 7th, 2020, 11:10:11 PM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను మరొకసారి ఎండగట్టే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. సుప్రీం లో కేసు వేసింది కేసీఆరే అనే బండి సంజయ్ ఆరోపించారు. సుప్రీం లో కేసు నడుస్తుండగా,ట్రిబ్యునల్ వేసే అవకాశమే లేదు అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ ట్రిబ్యునల్ అనడం లో ఆంతర్యం ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. గత 6 సంవత్సరాలు గా ట్రిబ్యునల్ పేరుతో సీఎం కేసీఆర్ కాలయాపన చేయడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం జరిగింది అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఉప సంహరించుకొని కేంద్రాన్ని అడిగితే ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేది అని బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.