నువ్వు కూడా జైలుకే వెళ్తావ్.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్..!

Tuesday, March 2nd, 2021, 06:30:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ధర్నా చేపట్టింది. బీజేపీ కార్యాలయం నుంచి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భానుపకాశ్ అరెస్ట్ విషయంలో ఐజీ ప్రభాకర్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు, అంతేకాదు భానుప్రకాష్‌పై చేయి పడితే ఫామ్‌హౌస్‌పై చేయి వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నువ్వు కూడా జైలుకే వెళ్తావ్ అని కేసీఆర్‌‌ను హెచ్చరిస్తూనే లాలూ, కరుణానిధికి ఏం జరిగిందో‌ గుర్తుచేసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.