సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్.. ఏమన్నారంటే?

Thursday, December 17th, 2020, 03:00:31 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డెడ్‌లైన్ విధించారు. కాళీమాత దేవాలయం భూములపై వివాదం చోటు చేసుకున్న నేపధ్యంలో ఈ ఘటనపై 24 గంటల్లో సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించకపోతే పాతబస్తీలో ఉద్యమం చేపడుతామని, బీజేపీ చేపట్టే ఉద్యమానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు.

అయితే హిందువో బొందువో సీఎం కేసీఆరే తేల్చుకోవాలని, తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతుందో పోలీసులు ఊహించుకోవాలని హెచ్చరించారు. కాషాయ వస్త్రాలు ధరించిన మాత్రాన కేసీఆర్ హిందువు కాలేడని ఎద్దేవా చేశారు. కాళీమాత భూముల కబ్జాకు సహకరించిన డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కార్యకర్తలకు డీసీపీ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.