సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Wednesday, September 9th, 2020, 12:17:16 AM IST


తెలంగాణ రాష్ట్రం లో చోటు చేసుకుంటున్న పరిణామాల పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీరు ను తప్పు బడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల పాలు చేసింది అని ఘాటు విమర్శలు చేశారు. అయితే హైదరాబాద్ మహా నగరం లో అక్రమం గా సంపాదించుకున్న ఆస్తులను క్రమబద్దీకరించుకొనెందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ ఆర్ ఎస్ తీసుకు వచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సైతం పలు విమర్శలు చేసిన బండి సంజయ్, నేడు భువన గిరి లో మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే తాజాగా తెలంగాణ కేబినెట్ పలు బిల్లులను ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్ కూడా ఉండటం గమనార్హం. దీని పై ఇప్పటికే ఇతర పార్టీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ రెవెన్యూ చట్టాన్ని తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని ఆరోపించారు. అయితే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను దివాళా తియించిన కేసీఆర్, దేశాన్ని ఎలా ఉద్దరిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినం గా ప్రకటించాలి అని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.