గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుంది – బండి సంజయ్

Monday, February 8th, 2021, 02:04:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మరొకసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజనులు అనాదిగా వన్య మృగాలతో పోరాడుతూ వస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ గుంట నక్కలు, గద్దలు మనుషుల రూపం లో వచ్చాయి అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే గిరిజనుల మీద దాడి చేసిన, బెదిరించినా వదిలిపెట్టేది లేదు అని బండి సంజయ్ హెచ్చరించారు. అయితే గిరిజనుల పై దాడి జరిగిన ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గిరిజనుల మీద హత్యాయత్నం కింద కేసులు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లేదంటే గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క తెరాస పై ఎదురుదాడి కి దిగుతుంది అని అన్నారు. గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుంది అని తెలిపారు.

అయితే గిరిజనుల భూములు రక్షించేందుకు వెళ్తే కేసీఆర్ పోలీసులతో తమ పై లాఠీ ఛార్జ్ చేయించారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాక కబ్జా కొరులకు ఆయన కొమ్ము కాస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నాగార్జున సాగర్ లో గిరిజనులు దీని పై కచ్చితంగా పగ తీర్చుకుంటారు అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో జరుగుతున్న తాజా పరిణామాల పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెరాస కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.