ఎన్టీఆర్, పీవీ ఘాట్ లకు బీజేపీ రక్షణగా ఉంటుంది – బండి సంజయ్

Thursday, November 26th, 2020, 12:53:05 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహ రావు ఘాట్ ల పై ఎం ఐ ఎం నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలు అని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ లకు అతీతంగా అందరినీ వారు గౌరవిస్తారు అని అన్నారు.అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన బండి సంజయ్, పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లకు బీజేపీ అండగా ఉంటుంది అని తెలిపారు.

అయితే మహ నేతల పై ఓవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరం అని, కేసీఆర్ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. అయితే ఎం ఐ ఎం చేసిన వ్యాఖ్యలకి తెరాస, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లకు బీజేపీ రక్షణ గా ఉంటుంది అని స్పష్టం చేశారు. గ్రేటర్ ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా తెరాస నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అని తెలిపారు. అయితే ఎన్టీఆరే, పివి నరసింహ రావు ఘాట్ లని సందర్షించిన బండి సంజయ్ ఈ మేరకు ప్రత్యర్థుల పై ఘాటు విమర్శలు చేస్తూ, ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని కొరతాం అని తెలిపారు.