వరంగల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం.. బండి సంజయ్ కామెంట్స్..!

Saturday, April 17th, 2021, 03:00:55 AM IST

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్‌కు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమి లేదని సాగర్ ప్రజలు బీజేపీని గెలిపించుకుంటారన్న నమ్మకం తమకి ఉందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు ఉన్నప్పుడే బయటికి వస్తాడని ఆ తర్వాత ప్రజల గురుంచి పట్టించుకోకుండా ఫాంహౌస్‌లోనే సేద తీరుతాడని అన్నారు. సీఎం కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికలంటే భయం పట్టుకుందని అన్నారు.

అయితే నేడు వరంగల్‌లో పర్యటించిన బండి సంజయ్ గ్రేటర్ వరంగల్‌లో కాషాయ జెండా ఏగరడం ఖాయమని అన్నారు. వరంగల్‌లో వరదలు వస్తే బీజేపీ ఆదుకుందని గుర్తు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల అక్రమణల కారణంగానే వరంగల్ నీట మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ ఏనాడూ చెప్పలేదని అన్నారు. అయితే వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీనీ గెలిపించుకోవాలని అన్నారు.