రాష్ట్రంలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు – బండి సంజయ్

Wednesday, January 13th, 2021, 03:31:36 PM IST

జనగామ లో బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపు ఇవ్వడం తో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిరసన తెలుపుతున్న కార్యకర్తల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పట్ల బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు కి నిరసన గా నేడు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అయితే జనగామ చౌరస్తా నుండి బాధితులు ఉన్న ఆసుపత్రి వరకు కూడా కాలినడకన వెళ్ళారు. ఈ మేరకు బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

లాఠీ ఛార్జ్ చేసిన పోలీసుల పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక తెరాస ఫ్లెక్సీ లు ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీ లు తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో రాక్షస పాలన కొనసాగుతుంది అని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ నుండి బయటికి వచ్చి బాధ్యుల పై చర్యలు తీసుకొని యెడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక రాష్ట్రంలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అని తెలిపారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.