అలా ప్రయత్నిస్తే ఒక్క మంత్రి కూడా ఇంటి నుండి బయటికి రాలేరు

Saturday, December 26th, 2020, 07:33:01 AM IST


తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ, అధికార పార్టీ కి గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి తెరాస ప్రయత్నిస్తే ఒక్క మంత్రి కూడా ఇంటి నుండి బయటికి రాలేరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగిత్యాల లో తన పర్యటన ను అడ్డుకొనేందుకు తెరాస ప్రయత్నించడం పట్ల బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాడి చేస్తే పక్కాగా ప్రతిదాడి చేస్తామని అన్నారు. అయితే ఈ మేరకు జగిత్యాల లో రైతుల తో బండి సంజయ్ సమావేశం నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సన్నవడ్లు పండించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నట్టేట ముంచారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రైతులు అంతా నూతన వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నారు అని, అయితే తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కారణాలతో రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఏ కారణం లేకుండానే కొత్త వ్యవసాయ చట్టాల పై సీఎం కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ ఆర్ ఎస్ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు అని, ఆ పద్దతి రద్దు చేసే వరకు బీజేపీ పోరు కొనసాగుతూనే ఉంటుంది అని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.