వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడం లేదు – బండి సంజయ్

Friday, January 1st, 2021, 04:34:55 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పలు చోట్ల బీజేపీ తన సత్తాను చాటుతోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అధికార పార్టీ కి గట్టి దెబ్బ వేసింది అని చెప్పాలి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిలి సై ను కలవడం జరిగింది. అయితే భేటీ అనంతరం, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ను అభివృద్ది కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు అని తెలిపారు. అంతేకాక వారు చెప్పిన సమస్యలను పరిష్కరించడం లేదు అని తెలిపారు. అయితే అధికార పార్టీ తెరాస పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పదుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. వారి దోపిడీ ప్రణాళిక పూర్తి అయ్యే వరకు కూడా కొత్త పాలక వర్గం ను అనుమతించ కూడదు అని నిర్ణయం తీసుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.