అసలైన ఉద్యమకారులను తెరాస విస్మరిస్తోంది – బండి సంజయ్

Monday, December 7th, 2020, 07:25:35 AM IST

ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల పట్ల అధిష్టానం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అయితే జీ హెచ్ ఎం సి ఫలితాల పై రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అభినందించారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఇదే దూకుడు భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కూడా చూపాలని సూచించిన విషయాన్ని బండి సంజయ్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తెరాస ప్రజా వ్యతిరేక విధానాల పై బీజేపీ పోరాటం చేస్తోంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం లో అసలైన ఉద్యమ కారులను తెరాస విస్మరిస్తోంది అని బండి సంజయ్ అన్నారు.

అయితే బీజేపీ లో ప్రముఖ నటి విజయశాంతి చేరనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భేటీ అనంతరం ఇదే విషయం పై బండి సంజయ్ ఇక స్పష్టత ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ లో నటి విజయశాంతి చేరనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ లో చేరగా, ఇంకా కొందరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలలో సైతం చర్చలు జరుగుతున్నాయి.