దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి – బండి సంజయ్

Wednesday, February 24th, 2021, 12:13:18 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ను ఎండగడుతూ విమర్శలు చేశారు. మూర్ఖుడి చేతిలో బందీ అయ్యాను అని తెలంగాణ తల్లి ఘోషిస్తుంది అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ ప్రజల ముందుకి వస్తుంది అని పేర్కొన్నారు. కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్ విశ్వాస ఘాతకుడు అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ లో కేసీఆర్ ను కుక్కలు కూడా విశ్వసించడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే పివి జయంతి కి వచ్చిన కేసీఆర్, వర్ధంతి కి ఎందుకు రాలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఎన్నికల్లో ఒడిపోతామనే ఎమ్మెల్సీ టికెట్ ను పీవీ కూతురు కి ఇచ్చారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటూ బండి సంజయ్ అన్నారు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగం గా బండి సంజయ్ అధికార పార్టీ తెరాస పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెరాస కి ఎందుకు ఓటెయ్యాలి అని సూటిగా ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని యువతను వంచించినందుకా? పీఆర్సీ ఇస్తానని ఉద్యోగులను మోసం చేసినందుకా అంటూ వరుస ప్రశ్నలు వేశారు. అయితే పోలీసుల తో బీజేపీ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన పార్టీ బీజేపీ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.