ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రగతి భవన్ కే పరిమితం – బండి సంజయ్

Monday, February 22nd, 2021, 04:15:12 PM IST

Bandi-Sanjay

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ప్రభుత్వ తీరు పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో రాక్షస పాలన, గడీ ల పాలన కొనసాగుతుంది అంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ను గెలిపించాలని బండి సంజయ్ ప్రజలకు సూచించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే నీచ రాజకీయాలకి సమాధి కట్టాలన్నా, తెరాస పార్టీ మెడకు వంచాలన్నా దమ్మున్న బీజేపీ ను గెలిపించాలని బండి సంజయ్ సూచించారు.

అయితే అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉపాధ్యాయులను మోసం చేసింది తెరాస ప్రభుత్వమేనని, వారి కోసం జైలుకి వెళ్లిన బీజేపీ ను గెలిపిస్తే పీఆర్సీ వస్తుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నీ గెలిపిస్తే ఎల్ ఆర్ ఎస్ పారిపోయింది అని, ఈ ఎన్నికల్లో బీజేపీ ను గెలిపిస్తే పీఆర్సీ, నోటిఫికేషన్ వస్తాయి అని అన్నారు.