రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు – బండి సంజయ్

Monday, February 15th, 2021, 01:02:48 PM IST

Bandi-Sanjay

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోడు భూములు విషయం లో ప్రభుత్వం వెంటేన్ విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.అయితే సేవాలాల్ జయంతీ వెడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సేవాలాల్ సంచార జాతుల ను ఏకతాటి పైకి తీసుకు వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన తెలుగు గడ్డ పై జన్మించడం గర్వకారణం అంటూ కొనియాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా గుర్రపు బోడు తండాలో గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా గిరిజనులు అంతా కూడా ఏకమవుతున్నారు అని బండి సంజయ్ ఈ సమావేశం లో అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 10 శాతం మంది గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కావడం లేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు అని వ్యాఖ్యానించారు. రాబోయే ఉప ఎన్నికల్లో గిరిజనులు తప్పక బుద్ది చెబుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.