పాతబస్తీలో సర్జికల్ స్త్రైక్స్ చేస్తాం – బండి సంజయ్

Tuesday, November 24th, 2020, 02:29:29 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హోరు వేడెక్కింది. బీజేపీ కీలక నేత, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారు అని ఆరోపించారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీ లో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. తెరాస మరియు ఎం ఐ ఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధించి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.

తెరాస హైదరాబాద్ కి గత ఆరేళ్లు చేసిన సేవలను, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తుండగా, అదే తీరు లో ప్రతి పక్ష పార్టీ నేతలు ప్రజలకు చేసిందేమీ లేదు అని, ప్రజలను మోసం చేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదు అంటూ పలువరు అంటున్నారు.