టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో…బండి సంజయ్ సెటైర్స్

Thursday, February 11th, 2021, 04:32:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేయర్ మరియు ఉప మేయర్ పదవులు దక్కించుకోవడం పట్ల బీజేపీ కీలక నేత, ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ మరియు ఎంఐఎం ల మధ్య ఉన్న అక్రమ సంబంధం మరొకసారి బహిర్గతం అయింది అని విమర్శలు చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము చెప్పింది నిజమైంది అని, చీకట్లో రెండు పార్టీలు ప్రేమించుకుంటూ బయటికి మాత్రం వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశారు అని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్ఎస్ కి సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు. అయితే తెరాస పార్టీ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈరోజు ఋజువైంది అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు.

అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయం అని అన్నారు. అయితే సిగ్గులేకుండా తాము ఎన్నికల్లో వేర్వేరు అని చెప్పుకొని ప్రచారం. చేసుకున్నారు అంటూ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే నీతి వంతమైన రాజకీయం చేయాలని భావిస్తే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయి అంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని, తెరాస అవినీతి ను బయట పెడతామని, అవకాశం వస్తే కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.