అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది – బండి సంజయ్

Tuesday, September 22nd, 2020, 10:31:36 PM IST


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, మరియు పాలనా విధానం పై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మరియు మంత్రులు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్య పెడుతూ పాలన సాగిస్తున్నారు అని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు, హక్కుల్ని ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ ఆర్ ఎస్ పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణం అంటూ మండిపడ్డారు.

అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన తెరాస మోసపూరిత వైఖరి ను ప్రజలు గుర్తించారు అని పేర్కొన్నారు. అంతేకాక మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ ఆర్ ఎస్ భారం మోపడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలన లో హక్కుల కోసం గోంతెత్తడం కూడా నేరమే అవుతుంది అని అన్నారు.