హెల్త్ బులెటిన్ బోగస్… వాటిని నమ్మి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు!

Thursday, July 23rd, 2020, 02:07:23 AM IST


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. అంతేకాక విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ కూడా పూర్తిగా బోగస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలను నమ్మి ప్రజల తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని బండి సంజయ్ హితవు పలికారు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మద్య విభేదాలు ఉన్నాయి అని అన్నారు. వారి విభేదాల కారణంగా ప్రజలు బలి అవుతున్నారు అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతునప్పటికీ కూడా దనార్జనే ధ్యేయంగా సీఎం వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ఎన్ 95 మాస్క్ ల్లో నాణ్యత లేదు అని, పెద్ద కుంభకోణం జరుగుతుంది అని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరు ను మందలించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాక రాష్ట్రం లో వైద్యం కోసం 5 వేల కోట్ల రూపాయల ను వెంటనే ప్రకటించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కి సంబంధించిన చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అని అన్నారు.