రాష్ట్రంలో పోలీసులు ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు – బండి సంజయ్

Thursday, March 11th, 2021, 11:48:20 PM IST

రాష్ట్రంలో చట్టం ఒక వర్గానికే కొమ్ము కాస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బైంసా పరిధిలోని మీర్జాపూర్‌లో లైంగిక దాడికి గురై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికపై అత్యాచారం అమానవీయ ఘటనగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాయడం సరికాదని, ప్రజలకు సేవ చేయడమే పోలీసుల లక్ష్యం కావాలి అని అన్నారు. అలాగే చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పుకొచ్చారు.