ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది – బండి సంజయ్

Friday, August 21st, 2020, 11:08:18 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వలనే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ప్రమాదం జరిగి 12 గంటలు కావొస్తున్నా ఉద్యోగుల ఆచూకీ కనుక్కోలేక పోయారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే జరిగిన ఈ ప్రమాదానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ బాధ్యత వహించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జరుగుతున్న ప్రాజెక్ట్ ల పై బండి సంజయ్ మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరొకసారి టార్గెట్ చేస్తూ సంగమేశ్వర టెండర్లు, పోతిరెడ్డపాడు ద్వారా జరుగుతున్న టువంటి జల దోపిడీ ను రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకొలేకపోయారు అని తెలిపారు. ఈ విషయాల్లో తెరాస ప్రభుత్వం కనీస జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం తోనే శ్రీశైలం లో ప్రమాదం జరిగింది అని అన్నారు. అయితే అక్కడి అధికారులు కాలయాపన చేయకుందా, చిక్కుకున్న ఉద్యోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు.