కేసీఆర్ పై మరొకసారి సీరియస్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

Tuesday, August 25th, 2020, 10:16:56 PM IST

Bandi-Sanjay

శ్రీశైలం అగ్ని ప్రమాదం జరగడం పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీ తెరాస కి వరుస ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అంటూ పలువురు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు మరొక సారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఘటన పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీశైలం దుర్ఘటన మృతుల కుటుంబాలకు రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అయితే ప్రమాదం జరిగిన అయిదు రోజులు అవుతున్నా, ఇంకా కారణాలను గుర్తించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కి నిదర్శనం అని విమర్శించారు. ఈ ఘటన పై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి అని, అందుకోసం ముందుగా నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల వలనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. అయితే ఈ ఘటన విషయం లో నిపుణుల కమిటీ వేయకుండా, సీఐడీ విచారణకు ఎందుకు ఆదేశించారు ఏ మాత్రం అర్దం కావడం లేదు అని అనుమానం వ్యక్తం చేశారు.