కేసీఆర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Thursday, March 4th, 2021, 01:34:18 AM IST


తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని, దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఇక నుంచి సీఎం కేసీఆర్‌ను టెన్షన్‌ పెడదామని ప్రతి ఒక్కరు కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నాడని ఇప్పుడు తాను, తన కుటుంబం జైలుకు వెళ్లకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారని అందుకే ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని ఇకపై ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడం కాదు, వార్నింగ్‌లే ఇస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి రామచందర్‌రావును గెలుపుకు కృషి చేయాలని అన్నారు.