కేసీఆర్ చూపిస్తున్న వివక్ష బట్టబయలైంది

Thursday, December 31st, 2020, 04:35:12 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న తీరు నిర్లక్ష్యం గా ఉంది అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో టీచర్ల పాత్ర మరువలేనిది అంటూ బండి సంజయ్ కొనియాడారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి చర్చలకు ఉపాధ్యాయులను అహ్వానించక పోవడానికి గల కారణం చెప్పాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అయితే తాజాగా మొన్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారు అంటూ మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తుంటే సీఎం కేసీఆర్ కి వారి పట్ల ఉన్న వివక్ష బట్టబయలైంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రెండున్నర ఏళ్ల దాటినా పీఆర్ సి ఎందుకు అమలు చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే భవిష్యత్ తరాలను తీర్చి దిద్దే ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గం అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.