కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, December 15th, 2020, 03:00:11 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై మాట్లాడిన బండి సంజయ్ కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పామని, కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పక్కన, ఎవరో ఒకరిని వెంట తీసుకెళతారని కానీ ఈ సారి ఒక్కరే వెళ్లారని ఆ రహస్యం ఏంటో చెప్పాలన్నారు. కేంద్ర పెద్దలతో కేసీఆర్ లోపల ఏం మాట్లాడారో రాతపూర్వకంగా ఇస్తేనే ప్రజలు ఆయన్ను నమ్ముతారని అన్నారు.

అయితే కేంద్రాన్ని బద్‌నాం చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని వంగి వంగి పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించమని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు చావు దెబ్బ కొట్టారని, ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయట చెప్పేది ఒకటి, లోపల జరిగేది మరోకటని అన్నారు. రదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదని అన్నారు. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారని కానీ అడ్డగోలుగా అంచనాలు పెంచేసారని అన్నారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసారని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.