కేసీఆర్ అవినీతి చిట్టా అంతా మా చేతిలో ఉంది

Tuesday, December 8th, 2020, 09:25:38 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాల పై కోర్టులను ఆశ్రయిస్తామని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా తమ చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని బండి సంజయ్ గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఎల్ ఆర్ ఎస్ విధానం లోని లోపాల పై ఉద్యమం చేస్తామని బండి సంజయ్ అన్నారు. అంతేకాక ఎమ్మెల్యే ల, మంత్రుల అక్రమాలు, అవినీతిని బయట పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే అవినీతి సాక్ష్యాలతో కోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు.