మేయర్ పదవిని ఎంఐఎంకు ఇచ్చేందుకు కేసీఆర్ కుట్ర – బండి సంజయ్

Saturday, November 14th, 2020, 12:35:43 AM IST

Bandi-Sanjay
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి అప్పగించేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుందని అన్నారు. 63 డీవిజన్‌లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని, దీనిపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు.

అయితే దుబ్బాక ఎన్నికలలో వచ్చిన ఫలితమే గ్రేటర్‌లో పునారవృత్తం అవుతందని, బీజేపీ దాదాపుగా 100 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. ఎంఐఎంకు మేయర్‌ పదవి దక్కుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్‌ వరద సహాయం కింద ఇస్తున్న ఆర్థిక సాయం విషయంలోనూ పెద్ద స్కాం జరిగిందని ఆరోపించారు. దుబ్బాక ఉపఎన్నికల విషయం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందని అన్నారు.