ఏపీ రాజకీయ పరిణామాల పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Thursday, September 24th, 2020, 06:06:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుమల శ్రీవారి ఆలయం కేంద్రం గా రాజకీయ వివాదం చెలరేగుతోంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయం కేంద్రం గా ఇలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం బాధాకరం అని ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన ఇలాంటి అంశాల పై రాజకీయ జోక్యం తగదు అని అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఆనాదిగా వస్తున్నాయి అని, ఇందులో లోటుపాట్లు విచారణ జరిపేది, చర్చించేది స్వామీజీ లు, పీఠాధిపతులు అని సంజయ్ వ్యాఖ్యానించారు.

అయితే ఇలాంటి వ్యవహారం లో రాజకీయ నేతలు తల దూర్చడం బావ్యం కాదు అని అన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ నేతలు కలగజేసు కుంటే వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారు అని అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యా నంద్ ల పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఒక రథం కాలిపోతే, ఒక చెక్క కలిపోయింది అంటూ భక్తుల విశ్వాసం ను దెబ్బ తీసేలా మాట్లాడటం దారుణం అని అన్నారు.