బీజేపీ మోర్చాలకు ఇంఛార్జ్‌లను నియమించిన బండి సంజయ్..!

Thursday, December 17th, 2020, 09:00:49 PM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెట్టింది. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న బీజేపీ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. ఈ నేపధ్యంలో తాజాగా బీజేపీ మోర్చాలకు ఆ పార్టీ అధినేత బండి సంజయ్ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.

బీజేపీ యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా దుగ్యాల ప్రదీప్‌ను, కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ప్రేమేంధర్‌రెడ్డిని నియమించారు. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా మనోహర్‌రెడ్డి, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా బంగారు శృతిని, మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా రాంచంద్రారెడ్డి, బీసీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా యెండల లక్ష్మీనారాయణ, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు.