బీజేపీ ఓటమికి కొన్ని పార్టీలు పని చేశాయి – బండి సంజయ్

Sunday, March 21st, 2021, 04:05:17 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల పరాజయం పాలైంది. అయితే ఊహించని రీతిలో తెరాస అభ్యర్దులు రెండు చోట్ల కూడా విజయం సాధించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. బీజేపీ ఉద్యమం వలనే పీఆర్సీ పై సీఎం కేసీఆర్ స్పందించారు అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పీఆర్సీ ఇవ్వరనే భయం తోనే తెరాస కి ఓటు వేశారు అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు షేరింగ్ పెరిగింది అని వ్యాఖ్యానించారు. అయితే తెరాస పార్టీ కొట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచింది అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఓటమికి కొన్ని పార్టీలు పని చేశాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ పోలింగ్ రోజున జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తెరాస అభ్యర్థి అయిన పీవీ వాణి దేవి కి మద్దతు ప్రకటించారు. అయితే పలువురు పవన్ అభిమానులు సైతం తెరాస అభ్యర్ధి అయిన వాణి దేవి కి ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై బీజేపీ నేత బండి సంజయ్ పరోక్షంగా స్పందించారు.