హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాం – బండి సంజయ్

Friday, December 18th, 2020, 04:30:32 PM IST

హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచాం అని, అమ్మవారి దయవల్లే వచ్చే అయిదేళ్ళు కార్పొరేటర్లు ప్రజలకు సేవలు అందిస్తారు అని తెలిపారు. అయితే తమని నమ్మి విశ్వాసం తో గెలిపించిన ప్రజలకు సేవ చేస్తాం అని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. అయితే కేంద్రం ప్రభుత్వం నుండి నిధులు తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నామని బండి సంజయ్ అన్నారు. అయితే ఓ వర్గం ప్రజల కోసం మెజారిటీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తోంది అని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే అధికార తెరాస కుట్రలు మరియు కుతంత్రాలతో ప్రజలను అవమానిస్తోంది అని అన్నారు. అయితే ఎం ఐ ఎం తో కేసీఆర్ దోస్తీ వలన పాతబస్తీ అభివృద్ది జరగడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే భాగ్య నగరం లో ఎం ఐ ఎం నుండి విముక్తి చేసేందుకు కృషి చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి కొందరు ఘాటు విమర్శలు చేస్తుండగా మరి కొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.