ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Friday, March 5th, 2021, 08:35:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. అయితే ఈ బంద్ కి ఒక్క బీజేపీ పార్టీ మినహా మిగతా అన్ని పార్టీ లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. అంతేకాక విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు కి రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు మూతపడ్డాయి. విశాఖ లోని ఆంధ్రా విశ్వ విద్యాలయాన్ని మూసి వేసినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం చేశారు. అయితే లారీ యాజమానుల సంఘాల తో పాటుగా, మహిళా సంఘాలు సైతం ఈ బంద్ కి మద్దతు ఇచ్చాయి. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు అన్నీ కూడా డిపో లకే పరిమితం అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురు అవుతున్నాయి.