లోటస్ పాండ్‌లో 60 గదులు.. ఒక సెంటు‌లో పేదల ఇళ్లు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

Monday, December 28th, 2020, 04:47:45 PM IST

వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్లపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల ఇళ్ల పేరు చెప్పి 7 వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్ తాను ఉండడానికి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో 60 గదులు నిర్మించుకున్నారని, ఒక సెంటు‌లో పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిపై తాను చేస్తున్న ఆరోపణలు ఆధారాలు ఉన్నాయని, నా ఆరోపణలు అవాస్తవమైని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

అయితే ఇళ్ల పట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చామో అన్ని ఆధారాలు ఉన్నాయని బండారు సత్యనారాయణ అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. జగన్ ఒక మూర్ఖుడు, అహంకారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.