బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. బాల్క సుమన్ వార్నింగ్..!

Thursday, January 7th, 2021, 12:39:00 AM IST


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న వరంగల్ పర్యటన్లో సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బాల్క సుమన్ సీఎం కేసీఆర్‌ను అవహేళన చేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే నాలుక కోస్తామన్నారు.

అంతేకాదు మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేను ఒక్క మాట అన్నా శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో, ఇక్కడ కేసీఆర్ పైన ఎవరైనా తప్పుగా మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే స్పందించాలన్నారు. కేసీఆర్‌ను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు ఊరుకోవాలని, అడ్డమైన వారితో మాటలు పడేందుకా కేసీఆర్‌ తెలంగాణ తెచ్చింది అంటూ బాల్క సుమన్ ఫైరయ్యారు. బండి సంజయ్‌ కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోనేది లేదని, సమయం వచ్చినప్పుడు బండి సంజయ్ భరతం పడతామని అన్నారు.