నోరు అదుపులో పెట్టుకో…బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్

Tuesday, December 15th, 2020, 06:33:50 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ల సమావేశం పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెరాస నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ విమర్శించారు. అయితే నాడు తెలంగాణ రాష్ట్రం కోసం, నేడు అభివృద్ది కోసం కేసీఆర్ పాటు పడుతున్నారు అని అన్నారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక సంబంధాలు ఉంటాయి అని, వాటిలో భాగం గానే సీఎం కేసీఆర్ ఢిల్లీ కి వెళ్ళారు అంటూ స్పష్టం చేశారు. అయితే ఈ విషయం కూడా తెలియని బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని, నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం లో ఎన్నో రకాల పదవులు అనుభవించిన సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలి అని హెచ్చరించారు. అంతేకాక స్థాయి లేని వాళ్ళు అంతా కూడా కేటీఆర్ గురించి మాట్లాడటం సరికాదు అని అన్నారు.