కుర్ర దర్శకుడికి ఓకే చెప్పిన బాలయ్య ?

Tuesday, September 11th, 2018, 11:10:21 PM IST


ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫిలింసిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఇప్పటికే మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు .. తాజాగా మరో కుర్ర దర్శకుడితో కూడా సినిమాకు రెడీ అయ్యాడట. ఆ కుర్ర దర్శకుడు ఎవరో కాదు అనిల్ రావిపూడి. పాటస్ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనిల్ ఆ తరువాత సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలు తెరకెక్కించాడు. తాజాగా అయన బాలయ్యకు ఓ కథ చెప్పాడట, కథ బాగా నచ్చడంతో డెవలప్ చెయ్యమని బాలయ్య చెప్పినట్టు టాక్. గతంలో కూడా అనిల్ తో రామారావు గారు అనే టైటిల్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరో కథతోనే బాలయ్యను ఒప్పించాడని సమాచారం.