బాలయ్య జోరు ఎక్కడా తగ్గడం లేదుగా ?

Sunday, December 10th, 2017, 10:04:33 AM IST

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు ఎం ఎల్ ఏ గా ప్రజలకు అందుబాటులో ఉంటూనే .. మరో వైపు కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. సినిమాల విషయంలో ఎప్పుడు తగ్గేది లేదన్న బాలయ్య చెప్పినట్టుగానే వంద సినిమాలు పూర్తీ చేసి .. ఆపై వేగంగా వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 102 వ సినిమాగా వస్తున్నా జై సింహ సంక్రాంతికి సిద్ధం అవుతుంది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. తాజాగా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. రెండు దశాబ్దాల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి తో టాప్ హీరో సినిమా చేసాడు బలయ్య. మళ్ళీ ఇన్ని రోజులకు ఆయనతో సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ ఎలాగూ ఉంది .. అలాగే మరో యువదర్శకుడితో కూడా సినిమా ఉంటుందని టాక్ ?