బాలయ్య “నర్తనశాల” ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Tuesday, October 20th, 2020, 02:12:31 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నర్తనశాల చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో చేసిన చిత్రం ఆదిలోనే ఆగిపోయింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదల కాగా, 17 నిమిషాల నిడివి ఉన్న పలు సన్నివేశాల్ని చిత్ర యూనిట్ దసరా పండుగ నాడు, అక్టోబర్ 24 న విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం లో అర్జునుడు పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా అలనాటి అందాల తార సౌందర్య ద్రౌపది పాత్రలో కనిపించనున్న ది.

అయితే ఈ చిత్రం లో నటుడు శ్రీహరి సైతం భీముడు పాత్రలో నటించారు. అయితే సౌందర్య మరియు శ్రీహరి లను మళ్లీ చూసే అవకాశం రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, ఈ నర్తన శాల 17 నిమిషాల సన్నివేశాలు విడుదల అవుతుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.