తెలుగు రాష్ట్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోంది

Tuesday, January 26th, 2021, 08:05:00 PM IST

నటుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అయితే ఈ నేపథ్యం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి తో అబివృద్దికి పాటు పడాలి అంటూ చెప్పుకొచ్చారు. తండ్రి దివంగత స్వర్గీయ ఎన్టీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. సేవా భావంతో ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు.

కరోనా వైరస్ మహమ్మారి తాండవిస్తున్న సమయం లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుగా నిలబడి సేవలు అందించిన సంగతి తెలిసిందే. అంకితభావం తో వారు చేసిన సేవలను బాలకృష్ణ కొనియాడారు. కరోనా తో పోరాడి ప్రాణాలను కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు బాలకృష్ణ. అయితే మన దేశంలో అభివృద్ధి చేసిన వాక్సిన్ ఇతర దేశాల ప్రజలకు ఉపయోగ పడటం గర్వకారణం అని అన్నారు. దేశం అంతటా కూడా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోంది అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.