ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు..!

Tuesday, February 9th, 2021, 01:50:17 AM IST


ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే అచ్చెన్నాయుడుకు సమీప బంధువు వైసీపీ తరపున బరిలో నిలబడడంతో ఆయనకు అచ్చెన్నాయుడు పోన్ చేసి బెదిరించనట్లుగా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే అదే సమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ కూడా హల్ చల్ చేశారు. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని రోడ్లపై భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. అయితే వారెవరిపైనా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. కానీ అచ్చెన్నాయుడుకు ఫిబ్రవరి 2న కోటబొమ్మాలి కోర్టు రిమాండ్ విధించింది. రూ.50 వేల పూచీకత్తుతో అచ్చెన్నాయుడుకు సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అచ్చెన్నాయుడుతో పాటు 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.