భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు.. రేపు జైలు నుంచి విడుదల..!

Friday, January 22nd, 2021, 09:33:35 PM IST


బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న అఖిలప్రియ దాదాపుగా 17 రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ సెషన్స్ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కిడ్నాప్ కేసులో ఆ3 గా భార్గవ్ రామ్‌ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వదని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు.