బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూత!

Sunday, March 28th, 2021, 08:53:23 AM IST

కడప జిల్లా, బద్వేలు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన కడప లోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొంది ఇటీవల తన నివాసానికి చేరుకున్నారు. అయితే మళ్ళీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చేర్చడం జరిగింది. మునిసిపల్ ఎన్నికల్లో సైతం ఈయన పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఎమ్మెల్యే సుబ్బయ్య మరణం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అయితే వైద్యుడిగా, ఎమ్మెల్యే గా ఈయన సేవలు చిరస్మణీయం అని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుర్తు చేసుకున్నారు.