రాష్ట్రానికి ఒక న్యాయం.. పాతబస్తీకి ఒక న్యాయమా – బండి సంజయ్

Friday, November 27th, 2020, 03:03:23 AM IST

Bandi-Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. బీజేపీ విద్వేషాలు సృష్టిస్తోందని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ సీటు ఎంఐఎంకు వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉంటారని అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్నారని, టీఆర్ఎస్ ఎంఐఎంను పెంచి పోషించడం వల్లే రోహింగ్యాలు పెరిగారని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో టీఆర్ఎస్, ఎంఐఎం వేరు వేరంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఒక న్యాయం, పాతబస్తీకి ఒక న్యాయమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఅర్ఎస్ నేతలు చెబుతున్నట్టు ఎంఐఎం నేతలతో తమ పార్టీ నాయకులెవరికీ సంబంధం లేదని, ఎంఐఎం ఎప్పటికీ తమకు శత్రువేనని అన్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ వందకుపైగా స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.