దేశంలో గాడ్సే తొలి టెర్రరిస్ట్ : అజమ్ ఖాన్

Monday, December 22nd, 2014, 06:42:22 PM IST


గాంధి మహాత్ముడిని చంపిన గాడ్సే దేశంలోనే తొలి టెర్రరిస్ట్ అని ఉత్తరప్రదేశ్ మంత్రి అజమ్ ఖాన్ అన్నారు. గాంధిని చంపిన గాడ్సేను గొప్పవాడిగా పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలను పెట్టాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే… దీనిని ఉత్తరప్రదేశ్ మంత్రి అజమ్ ఖాన్ ఖండించారు. జాతిపితను చంపిన గాడ్సేను పొగడటం ఆపాలని, ఇక మత మార్పిడుల అంశంపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడులకు ప్రధాని లొంగరని, ప్రధాని ఆర్ఎస్ఎస్ ఒత్తిడుల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తారాని వస్తున్న వార్తలలో నిజం లేదని ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ మంత్రి అజమ్ ఖాన్ అన్నారు. ప్రధాని అజెండా వేరని, ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోరని అన్నారు. ఇక ప్రధాని మతమార్పిడుల అంశంపై మౌనం వీడాలని, లేకుంటే… తప్పుడు సంకేతాలు వెళ్తాయని అజమ్ ఖాన్ ఈ సందర్భంగా అన్నారు.