పంచాయతీ ఎన్నికలు అనగానే పరారయ్యారు.. జగన్‌పై అయ్యన్నపాత్రుడు సెటైర్లు..!

Tuesday, January 12th, 2021, 03:03:46 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సెటైర్లు వేశారు. నేడు మీడియాతో మాట్లాడిన అయ్యన్న పంచాయతీ ఎన్నికలు అనగానే సీఎం జగన్ రెడ్డి పరారయ్యారని అన్నారు. ఒక్క ఛాన్స్ కాదు లాస్ట్ ఛాన్స్ అని అర్ధమయ్యే జగన్ స్థానిక ఎన్నికలకు భయపడుతున్నారని విమర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వద్దని మాట్లాడి, ఇప్పుడు కుంటి సాకులు చెబుతూ ఎన్నికలు వద్దంటున్నారని, చెత్త పాలనపై వచ్చిన రహస్య నివేదికలు చూసిన తరువాత స్థానిక ఎన్నికలే కాదు, ఏ ఎన్నికైనా పులివెందుల పిల్లి పరారేనని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.