విజయసాయిరెడ్డి జైలు పక్షి.. అయ్యన్నపాత్రుడు సీరియస్ కామెంట్స్..!

Tuesday, September 29th, 2020, 04:42:43 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై దగ్గుబాటి పురందేశ్వరి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది అంటూ చేసిన విజయసాయి విమర్శలపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు.

అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా స్పందిస్తూ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని, నందమూరి కుటుంబం అంటే తులసీవనం లాంటిదని, పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయికి లేదని ఎద్దేవా చేశారు. విజయసాయి గంజాయి వనంలో గంజాయి మొక్కలాంటివాడని, అహంకారం నెత్తికెక్కి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ కాదు, దమ్ముటే సీబీఐ దర్యాప్తు వేయండని అప్పుడే అందరి జాతకాలు బయటకు వస్తాయని అయ్యన్న అన్నారు.