ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుంది – అయ్యన్నపాత్రుడు

Tuesday, November 3rd, 2020, 12:25:05 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులు ఉన్న జగన్ మరియు మూర్ఖత్వం, చేతకాని నీటిపారుదల శాఖ మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడి రాష్ట్రం కొంపముంచారని అన్నారు. మూర్ఖపు ముఖ్యమంత్రి పాలన, చేతకాని నీటి పారుదల శాఖ మంత్రి వల్ల ఈ 18 నెలల్లో పోలవరంలో తట్టెడు మట్టి కూడా వేయలేదని అన్నారు. ఇది కేంద్రం ప్రాజెక్ట్ కాబట్టి ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని అయ్యన్న అన్నారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్‌ను 72 శాతం పూర్తి చేశారని కానీ ఇప్పుడు అసలు ఆ పనులు ముందుకు కదలడం లేదని అన్నారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే, బెట్టింగ్‌లు వేసుకునే వ్యక్తి, క్యూసెక్కులకు, టీఎంసీలకు కూడా తేడా తెలియని వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రి అయితే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. అయితే ఈ పనికిమాలిన ప్రభుత్వంపై కోపంతో మాకు, మా రైతులకు అన్యాయం చేయకండి అంటూ మోదీ గారికి విన్నవించారు.