టంగ్ స్లిప్ అయిన విజయసాయి రెడ్డి.. సెటైర్లు గుప్పించిన అయ్యన్న పాత్రుడు..!

Wednesday, February 10th, 2021, 05:30:17 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. కర్మాగారం అనబోయి కారాగారం అన్నారు. ప్రస్తుతం ఆయన నోరు జారిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల అవుతుంది. దీనిపై మాజీ మంత్రి అయ్యన్నప్పాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విజయసాయిపై సెటైర్లు గుప్పించారు. బహుశా తను, తన బాసు కారాగారాలకు వెళ్లి వెళ్లి అలవాటు అయిపోయుంటుందని అన్నారు.

అయితే కర్మాగారం ఏదో, కారాగారం ఏంటో తెలియని వాడు రాజ్యసభ సభ్యుడు అవ్వడం మన ఖర్మ.గనులన్నీ గాలి బ్రదర్స్ తో కలిసి కొట్టేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్ చెయ్యడం విచిత్రంగా ఉందని అన్నారు. అంతేకాదు కర్మాగారం కోసం పోరాడితే జగన్ రెడ్డి కారాగారానికి పోతాడు అందుకే సైలెంట్ గా ఉన్నాడని సాయిరెడ్డి మనస్సులో మాట బయటపెట్టినట్టు ఉన్నాడని, జగన్ రెడ్డి చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుందని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు.