వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్ట్రాన్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి ఐదుగురు రెడ్లకు కట్టబెట్టిన సీఎం జగన్. 850 ముఖ్య పదవులలో కూడా రెడ్లను కూర్చోబెట్టారని అన్నారు. చట్టం ఒప్పుకోదు, బీసీలు ఊసేస్తారని ఊరుకున్నారుగానీ, లేదంటే 56 బీసీ కార్పొరేషన్లకూ కూడా రెడ్లనే పెట్టేసేవారు అంటూ ఎద్దేవా చేశారు.
అంతేకాదు బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపిక రెడ్ల దుష్టచతుష్టయం చేయడం బీసీలను అవమానించడమే అని, బీసీ కార్పొరేషన్ నిధులు 3432 కోట్లు మళ్లించడం, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడవడం కాదా సాయిరెడ్డి గారూ అని ప్రశ్నించారు. అంతకు ముందు చంద్రబాబు అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టడంపై స్పందించిన విజయసాయి అధిరారంతో విర్రవీగిన రోజుల్లో ‘అంతు చూస్తా, తోక కోస్తా’ అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయని, పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అని విమర్శలు చేశారు.
రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి ఐదుగురు రెడ్లకు కట్టబెట్టిన సీఎం @ysjagan ..850 ముఖ్యపదవుల్లో రెడ్లను కూర్చోబెట్టిన జగన్రెడ్డి..చట్టం ఒప్పుకోదు, బీసీలు ఊసేస్తారని ఊరుకున్నారుగానీ, లేదంటే! 56 బీసీ కార్పొరేషన్లకూ రెడ్లనే పెట్టేసేవారు.(1/3)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 20, 2020